SAINIK SCHOOL KORUKONDA AND KALIKIRI ADMISSIONS 2019-20 NOTIFICATION DETAILS IN TELUGU
విజయనగరం జిల్లా కోరుకొండ,చిత్తూరు జిల్లా కిలికిరి లోని సైనిక్ స్కూల్‌లో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.రాష్ట్ర అభ్యర్థులకు అవకాశం - రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక - 6,9 తరగతుల్లో ప్రవేశాలు - ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష వివరాలు:
మిలిటరీ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్‌ను అందించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్‌ను ఏర్పాటుచేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులను విద్యాపరంగా, శారీరకంగా, మానసికంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రమాణాలకు సరిపోయే రీతిలో సంసిద్ధులను చేస్తారు.
ప్రవేశాలు కల్పించే తరగతులు ఆరు, తొమ్మిది - ( కేవలం బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.)
ఆరోతరగతి:
సీట్ల సంఖ్య - 70 - విద్యార్థులు 2007,ఏప్రిల్ 31 నుంచి 2009, మార్చి 1 మధ్య (ఆ రెండు రోజులు కలుపుకొని) జన్మించి ఉండాలి.
తొమ్మిదో తరగతి:
సీట్ల సంఖ్య 8 విద్యార్థులు 2004, ఏప్రిల్ 31 నుంచి 2006, మార్చి 1 మధ్య జన్మించి ఉండాలి. సీట్ల సంఖ్య - 20 - కరికులమ్: సీబీఎస్‌ఈ 10+2 విద్యావిధానంలో విద్యను అందిస్తారు.
ఎంపిక:
ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల కోసం రాతపరీక్ష(6 జనవరి 2019) ఇంటర్వ్యూ, వైద్యపరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, కరీంనగర్, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ.
స్కాలర్‌షిప్స్:
ప్రతిభ/ తల్లిదండ్రుల వార్షికాదాయం ఆధారంగా డిఫెన్స్ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు.
రిజర్వేషన్లు:
మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లలో 67 శాతం సీట్లను తెలంగాణ, ఏపీ విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లకు దేశంలోని అన్ని రాష్ర్టాల, యూటీ అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు. రక్షణశాఖలో పనిచేసిన వారి పిల్లలకు 25 శాతం సీట్లను కేటాయిస్తారు.
నోట్:ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తగినంతగా లేనిపక్షంలో ఆ సీట్లను జనరల్ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
దరఖాస్తు:
ఆన్‌లైన్‌లో (అక్టోబర్ 08 నుంచి ప్రారంభం, డిసెంబర్ 1 చివరితేదీ)
దరఖాస్తు ఫీజు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే జనరల్/డిఫెన్స్ విద్యార్థులు రూ. 400/-, ఎస్సీ, ఎస్టీలు రూ. 250/- చెల్లించాలి.
చివరితేదీ:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 8 నుండి నవంబర్ 26 వరకు.
ఆన్లైన్ లో దరఖాస్తులకు 2018, డిసెంబర్ 1
పూర్తి వివరాల కోసం 08922-246119 & 246168 మరియు www.sainikschoolkorukonda.org లో సంప్రదించవచ్చు.
లేదా
0877-2500270 మరియు www.kalikirisainikschool.com లో సంప్రదించవచ్చు.