Vacancies in APSSA Notification for various posts in SSA ఎస్ ఎస్ ఏ లో కొలువుల పండగ
రాష్ట్రంలో సర్వ శిక్ష అభియాన్ లో మొత్తం 2379 పోస్టుల నియామకానికి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలోని నిరుద్యోగులకు దసరా శుభ వార్త, సర్వ శిక్ష అభియాన్ లో కొలువులకు తెర లేచింది అవుట్సోర్సింగ్ పద్ధతిలో మొత్తం 2379 పోస్టులను నియమించడానికి ఉత్తర్వులు వెలువడ్డాయి. నవంబరు 10వ తేదీ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఎస్ ఎస్ ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ rc 5101 ద్వారా ఆదేశాలు జారీ చేసారు. జిల్లాస్థాయిలో పోస్టుల భర్తీకి ప్రాజెక్ట్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారి, డైట్ ప్రిన్సిపాల్ తో కూడిన కమిటీ లు వేయాలన్నారు. సి ఆర్ టి, స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు 100 మార్కులకు ఆబ్జెక్టివ్ మోడల్ లో రాత పరీక్ష నిర్వహించాలని అందులో మెరిట్ ప్రాతిపదికగా జిల్లాస్థాయి రోస్టర్ ను పాటిస్తూ భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. 2018 జులై 1 నాటికి 39 ఏళ్లు మించని అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు, దివ్యాంగులకు 49 ఏళ్లుగా నిర్ణయించారు. నాన్ టీచింగ్ పోస్టులను కలెక్టర్ పర్యవేక్షణలోని జిల్లాస్థాయి కమిటీ లతో భర్తీ చేస్తారు.జిల్లాల వారీగా పోస్టులు శ్రీకాకుళం 207, విజయనగరం 147, విశాఖపట్నం 242, తూర్పుగోదావరి 235, పశ్చిమ గోదావరి 97, కృష్ణ 141, గుంటూరు 221, ప్రకాశం 76, నెల్లూరు 131, చిత్తూరు 483, కడప 105, అనంతపురం 117, కర్నూలు 176.
3 comments
HSSC Group D Result
HSSC Group D Result
nadakacheri
KSP Hall Ticket Check CPC Hall Ticket Online Here