-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

Dasara holidays in AP declared for 2018

Dasara holidays in AP declared for 2018
*దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం*
అక్టోబర్ 9 నుంచి సెలవులు 21వ తేదీ వరకూ స్కూళ్ల మూసివేత, 18న రానున్న విజయదశమి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం దసరా సెలవులను ప్రకటించింది.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 9వ తేదీ మంగళవారం నుంచి 21వ తేదీ ఆదివారం వరకూ సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. తిరిగి 22వ తేదీ నుంచి పాఠశాలు ప్రారంభించాలని, సెలవు రోజుల్లో స్కూళ్లు నడపరాదని వెల్లడించింది.కాగా, ఈ సంవత్సరం అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి పర్వదినాలు రానున్నాయి. 21వ తేదీన ఆదివారం రావడంతో, 22న స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. దీంతో విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం దసరా శెలవులు

దసరా సెలవుల్లో  ప్రిఫిక్స్,సఫిక్స్(PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం ఉందా?

ఈసారి దసరా సెలవులు 09-10-2018 నుండి 21-10-2018 వరకు అనగా 13 రోజులు.
పాఠశాల చివరి పనిదినం (08-10-2018) మరియు రీఓపెనింగ్ (22-10-2018) రెండు రోజులు బడికి హాజరవ్వాలా లేక ఒకరోజు హాజరైతే సరిపోతుందా,హాజరుకాకపోతే
 సెలవులన్ని Other Than CL గా పరిగణిస్తారా? హాజరుకాని రోజులు మాత్రమే OCL పెట్టుకుంటే సరిపోతుందా?అను సందేహం చాలామంది ఉపాధ్యాయుల మదిలో మెదులుతున్న ప్రశ్న?

*జవాబు:
* Rc.No.10324/E4-2/69 తేది:07-11-1969 ప్రకారం టర్మ్ హాలిడేస్ 10 రోజులకు పైబడి 15 రోజులకు మించకుండా ఉన్న సందర్భంలో ప్రిఫిక్స్,సఫిక్స్(PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం లేదు చివరి పనిదినం (08-10-2018) రీఓపెనింగ్ డే (22-10-2018) రెండు రోజులు పాఠశాలకు హాజరవ్వాలి. ఒకరోజు హాజరుకాకున్నా దసరా సెలవులన్ని *Other Than CL* గా పరిగణించబడతాయి.

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download